టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) కు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా సినిమా ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే.స్పైడర్, మన్మథుడు2 సినిమాల ఫలితాలు ఆమె కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.
అయితే తాజాగా రకుల్ రెమ్యునరేషన్ గురించి సంచలన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఒక సినిమా కోసం నటీ నటులిద్దరూ ఒకేలా కష్టపడతారని ఆమె అన్నారు.

అయితే నటీనటులకు రెమ్యునరేషన్( Remuneration ) విషయంలో చాలా వైవిధ్యం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.హీరోయిన్లకు సైతం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే సత్తా ఉందని రకుల్ తెలిపారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం ఈ విషయం గుర్తించాలని ఆమె పేర్కొన్నారు.సినిమాల్లో మెయిన్ రోల్స్ లో నటించిన వాళ్లందరికీ పారితోషికం ఒకే విధంగా ఉండాలని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్లు చేశారు.
మహిళలకు ఒక విధంగా పురుషులకు మరో విధంగ పారితోషికాలు ఉండకూడదని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమాలోని రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుందంటే అది ఆ రోల్ కు ఉన్న బలం అని రకుల్ అన్నారు.
అంతే తప్ప ఆ రోల్ లో ఎవరు నటించారని కాదని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతర భాషల్లో మూవి ఆఫర్లతో రకుల్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

రకుల్ పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. భారతీయుడు2 సినిమా( Bharateeyudu 2 )లో కీలక పాత్రలో రకుల్ నటిస్తున్నారు.తమిళంలో మరో రెండు ప్రాజెక్ట్ లకు సైతం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.రకుల్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కెరీర్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.







