పవర్లూమ్ కార్మికులకు 365 రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం నక్క దేవదాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్( Musham Ramesh) మాట్లాడుతూ మార్చి ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నివారణ కొరకు కార్మికుల నిరంతరం ఉపాధి కొరకు కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కార్మికులకు ఆసాములకు 365 రోజుల ఉపాధి భరోసా కల్పించాలని, రేపు కొత్త బస్టాండ్ తెలంగాణ చౌక్ వద్ద ఫ్ల కార్డ్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.

 Steps Should Be Taken To Provide 365 Days Work To Powerloom Workers-TeluguStop.com

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.గత మూడు మాసాల నుండి జమానులు పరిశ్రమలను మూసి వేస్తున్నారని వస్త్ర పరిశ్రమ పై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఆసాములు వార్పిన్ వై పని గుమస్తా జాపర్లకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఆర్థిక ఇబ్బందులతో పస్తులు ఉంటున్నారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోకుంటే కనుమరుగయ్య పరిస్థితి కనబడుతుందన్నారు.

ఉన్నఫలంగా గత ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేసిన పథకాలను అమలు చేయాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని బతుకమ్మ చీరల( Batukamma Sarees ) పెండింగ్ బకాయిలుయారన్ సబ్సిడీ ( Yarn subsidy)విడుదల చేయాలని వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని అన్నారు.

ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించేంతవరకు సిఐటియు పోరాడుతుందని అన్నారు.రేపు ఉదయం 9 గంటల వరకు బి వై నగర్ సిఐటియు కార్యాలయంలో వద్దకు పవర్లూమ్ కార్మికులు వార్పిన్ వై పని గుమస్తాలు జాఫర్లు కండెలు చుట్టేవాళ్ళు కార్మికులు అందరూ రావాలని అన్నారు.

ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎలిగేటి రాజశేఖర్, సిరిమల్లె సత్యం, గుండు రమేష్, ఒగ్గు గణేష్, సబ్వాని చంద్రకాంత్, కంది మల్లేశం బింగి సంపత్,సందుపట్ల పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube