4 కిలోల నిషేదిత ఎండు గంజాయి స్వాధీనం

ఇద్దరి వ్యక్తుల పై కేసు నమోదు.ఒక ద్విచక్ర వాహనం,మొబైల్ ఫోన్ స్వాధీనం.

 4 Kg Of Prohibited Dry Marijuana Seized-TeluguStop.com

గంజాయి అమ్మినా, త్రాగినా, సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవు.ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్( D.Sudhakar ).రాజన్న సిరిసిల్ల జిల్లా :నిషేధిత ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.గురువారం సాయంత్రం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ ఐ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో గంజాయి అక్రమంగా సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు అనంతారం రోడ్డులో గల కేడీసీసీ బ్యాంకు వద్ద ఇల్లంతకుంట ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా అనంతారం నుండి ఇల్లంతకుంట వైపు ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనుమానస్పదంగా వస్తుండగా వారిని ఆపి పట్టుకోగా నేరస్తుల వద్ద నాలుగు కిలోల ఎండు గంజాయి దొరికినట్టు ఆయన తెలిపారు.అనంతరం తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా నేరస్తులు తమ నేరాన్ని ఒప్పుకుంటూ ఇల్లంతకుంట గ్రామానికి చెందిన దమ్మని నవీన్ అనే వ్యక్తి హైదరాబాదులోని రోహన్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇల్లంతకుంటలోని తిప్పారంలో గల తన పాత ఇంటిలో గంజాయిని పెట్టి తన సోదరుడు అరవింద్ ద్వారా అమ్మించే వాడినని, గంజాయి సరఫరా విషయమై గతంలో కరీంనగర్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో అరవింద్, నవీన్ పైన కేసు నమోదు కాగా అట్టి కేసులో నవీన్ పరారీలో ఉన్నాడు.

అయితే పోలీస్ లు వారికొరకు, గంజాయి కొరకు వెతుకుతున్నారని పాత ఇంటిలో ఉన్న గంజాయిని ఎక్కడైనా పెట్టాలని తీసుకెళ్తుండగా వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు.నేరస్తుల నుండి నాలుగు కిలోల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .మండలంలో ఎవరైనా గంజాయి అమ్మినా, సరఫరా చేసినా, త్రాగినా పోలీస్ వారికి నేరుగా లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించినట్లయితే నేరస్తుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఇట్టి గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు కృషి చేసిన ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ ఫసియొద్దిన్, దేవేందర్ రెడ్డి, భూమయ్య, కానిస్టేబుల్ లు తిరుపతి, మధు, అనిల్, లక్ష్మినారాయణ, బాపు చందర్ లను ఎస్సై అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube