ద్వాదశ మాసములందు గణేశోపాసనములు ఏమిటి ?

విఘ్నాలు తొలగించే వినాయకుడిని ఉపాసించేందుకు మన తెలుగు క్యాలెండర్ లోని పన్నెండు మాసాల్లో ఒక్కో నెల ఒక్కో రకంగా ఉపాసిస్తుంటాం.అయితే అలా పన్నెండు రకాలుగా ఎందుకు ఉపాసిస్తాం… ఏ నెలలో ఏ రూపంలో ఉపాసిస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 What Are The Ganesh Worships During The 12 Months, Ganesh, Ganesh Worships, Devo-TeluguStop.com

చైత్ర మాసంలో వినాయకుడిని వాసుదేవ రూపముతో, వైశాఖ మాసంలో సంకర్షణ రూపముతో, జ్యేష్ఠ మాసము నందు ప్రద్యుమ్న రూపముతో, ఆషాఢ మాస సమయంలో అనిరుద్ధ రూపముతో, శ్రావణ మాసంలో బహుల యను పేరుతో భాద్రపద మాసం అందు సిద్ది వినాయకుడిని పూజిస్తారు.

ఆశ్వ యుజ మాసంలో కపర్దీశ అను పేరుతో, కార్తీకంలో కకర చతుర్థీ వ్రతం, మార్గ శీర్షంలో చతుర్వర్ష వ్రతం, పుష్యంలో విఘ్నవినాయక వ్రతం, మాఘంలో సంకష్ట హార గణేశ వ్రతం, ఫాల్గుణంలో ఢుండీ వినాయక వ్రతం చేస్తారు.

మంగళవారము చతుర్థీ తిథితో కలిసి వచ్చినచో దానిని అహంకార చతుర్థిగా చెప్తారు.ఇతి చాల ఫలదాయక మైనదిగా ప్రతీతి.అలాగే ఆదివారం నాడు వచ్చే చతుర్థి కూడా ఫలదాయక మైనదే.ఈ ఈ రోజుల్లో ఈ గణనాయకుడిని పూజిస్తే అనేక రకాల శుభాలు కల్గుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు.

అలాగే వినాయక నవరాత్రుల అప్పుడు కూడా ఆ స్వామి వారి పూజ చేసినా… మీకు మంచి ఫలితాలు వస్తాయి.అందుకే మనం ఏ పూజ చేసినా ముందుగా ప్రథమ పూజ అయిన వినాయకు పూజ చేస్తాం.

ఆ తర్వాతే మిగతా దేవుళ్లను ఆరాధిస్తాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube