ఒకప్పుడు వ్యవసాయ సంక్షోభంలో వుండే చందుర్తి తెలంగాణా వచ్చాక వడ్లారే బోసుకునే జాగా లేదు!

తెలంగాణా రాష్ట్రం భవిష్యత్తు సవాళ్లకు సమాధానం చెప్పే రాష్ట్రంగా మారింది!తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎలా వుండే ఇప్పుడెలా వుండే ప్రజలు బేరీజు వేసుకోవాలి!నేడు చందుర్తి మండలం నర్సింగా పూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజలు చేసిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్( Chennamaneni Ramesh )!రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ దళిత బంధు యూనిట్ ను, రు.20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు, రు.9 లక్షలతో నిర్మించే గ్రంధాలయ బిల్డింగ్ కు భూమి పూజ చేసి, రు.5 లక్షలతో నిర్మించిన రెడ్డి శంఘ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఆ మర్రి చెట్టు కాడ కావచ్చు ఇతరత్రా కావచ్చు మీరందరూ ఎవరి పరిధిలో వారు సకలజనుల సమ్మెలో పాల్గొనడం, వంట వార్పు చేయడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం.దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ అమరులందరికి కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

 Once Chandurthi Came To Telangana, Which Was In An Agricultural Crisis, There Is-TeluguStop.com

ఈరోజు మరి మన గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా సంతోషంగా ఉన్నదని ముఖ్యమంత్రి ఈ దశాబ్ది ఉత్సవాలలో ఒక ఉత్సవం అంటే అది రైతు దినోత్సవం కావచ్చు, మన ఊరు మనబడి, విద్య పండుగ కావచ్చు, మహిళల దినోత్సవం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకొని మనమేం చేసినము 9 సంవత్సరాల అనేటువంటి దానిమీద బేరిజు చేసుకుని ఆ తర్వాత భవిష్యత్తులో వచ్చే సవాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా జవాబు చెప్పాలి అనే విషయం మీద కూడా మరి కసరత్తు చేస్తున్నామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ( Chief Minister KCR ) కొత్త నిర్ణయం తీసుకున్నారు.

దళిత బంధు మొదటి విడతలో 100 యూనిట్లు వచ్చాయని పారదర్శకంగా వాటిని నైపుణ్యం, పట్టుదల కలిగిన నిరుపేదలకు అందించామని జూలై మాసంలో 1100 కొత్త దళితబంధు యూనిట్లు రాబోతున్నయని మన గ్రామానికి కచ్చితంగా 10 నుంచి 15 యూనిట్లు వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు.డబల్ బెడ్ రూం ఇండ్లకు కూడా మార్గదర్శకాలు వచ్చాయని అర్హులైన అందరికీ ఇస్తామని తెలిపారు.

ముఖ్య మంత్రి 3 గ్రామాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలుకు ఆలోచన చేస్తున్నారని అన్నారు.కరెంట్ పై ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోందని అన్నారు.

ప్రజలు కూడా అభివృద్ధిపై ఆలోచన చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచులు, ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube