ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో త్రాగునీటి సరఫరా లో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరిపడా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను ఆదేశించారు.గురువారం అగ్రహారం లో మిషన్ భగీరథ శుద్ధి జల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

 Rajanna Sircilla District Collector On Mission Bhagiratha,mission Bhagiratha,raj-TeluguStop.com

నీటి శుద్ధి ప్రక్రియలో ని దశలను పరిశీలించారు.
పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతిరోజు నీటి శుద్ధి కేంద్రాలనుండి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి రోజూ రెండు సార్లు జిల్లాలోని ఓహెచ్ఎస్ఆర్ లను మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్ నింపాలనీ అన్నారు.
నీటి నాణ్యతను ప్రతి రోజూ నాలుగు సార్లు పరిశీలించాలని అన్నారు.

ఇంకా జిల్లాలో ఏఏ గ్రామాలకు త్రాగునీరు వెళ్లడం లేదు పూర్తిగా తెలుసుకోవాలన్నారు.త్రాగునీరు వెళ్లని గ్రామాలకు… మిషన్ భగీరథ( Mission Bhagiratha ) నీరు వెళ్లేలా చూడాలన్నారు.

ఆ వెంటనే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రగుడు లో మున్సిపల్ ఆధ్వర్యంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.రెండు నెలలుగా ఆపరేషన్ లో లేదని సిరిసిల్ల పట్టణం అవసరాలకు సరిపడా త్రాగునీరు ను మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్( Water Treatment Plant ) ను ఆపరేషన్ లోకి తేవాలన్నారు.

ట్రీట్మెంట్ ప్లాంట్ స్టోరేజ్ ప్లాంట్ తో పాటు నెమలి గుట్ట పైన ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ఇతర ఓహెచ్ఎస్ఆర్ లను షెడ్యూల్ ప్రకారం క్లీన్ చేయాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ అభివృద్ధి పనులకు పరిశీలించారు.మే నెలాఖరు నాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం అభివృద్ధి పనులను కూడా పూర్తిచేసి ప్రారంభానికి సర్వసన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ప్రవేశ ద్వారం ను సుందరంగా ఉండేలా చూడాలన్నారు.గ్రౌండ్ లో ఎక్కువ గా స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేలా ప్లాన్ చేయాలన్నారు.ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మిషన్ భగీరథ గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీరు విజయ్ కుమార్, మిషన్ భగీరథ ఇంట్రా కార్య నిర్వాహక ఇంజనీరు జానకి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పబ్లిక్ హెల్త్ డీ ఈ ఈ ప్రసాద్ ,ఏఈ ఈ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube