అకాల వర్షానికి రైతులు నష్టపోయినా ప్రభుత్వానికి చలనం లేదని ఫైరయ్యారు బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్( BJP Bandi Sanjay ).పంట నష్టం అంచనావేసి రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు.
రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్లే రైతులు( Farmers )నష్టపోయారని మండిపడ్డారు.తరుగు,తేమ అని కొర్రీలు పెట్టి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం లీకేజిలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిందనీ,చివరికి నూతన సచివాలయంలో కూడా లీకేజిల ట్రెండ్ సాగుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.నష్టపోయిన ప్రతి రైతుకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అన్నదాతలకు అండగా బిజెపి ఉండి పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.