రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 21వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో వైన్ షాప్ లకు డ్రా విధానంలో దుకాణాలను కేటాయించే కార్యక్రమం ఉన్నందున ప్రజావాణి కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.