మా ఊరి బలగంతో.....బలగం మూవీ వీక్షణ

పట్టణం నుండి పల్లెల్లోకి బలగం చిత్రం రక్త సంబంధాలను గుర్తు చేసిన బలగం చిత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా: మానవ విలువలు మరిచి, స్వార్థలతో, ద్వేశలతో చిన్న చిన్న గొడవలకు దూరం అవుతున్న ,బంధాలకు కనువిప్పుకలిగిస్తుంది.బలగం చిత్రం.

 With My Village Balagam Balagam Movie Watch , Balagam Movie , Rajanna Sirisilla-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం సాయంత్రం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ,యువత ప్రోత్సాహంతో ….గ్రామంలో విలువలు మరిచి దూరం ఐతున్న ,కుటుంబాలు కలువాలే ఈ సినిమా చూస్తే ఐనా అనే ఆలోచనతో మా ఊరి బలగం అందరితో కలిసి బలగం చిత్రం ప్రదర్శించారు.

దాదాపు 500 నుండి 600 మంది వరకు గ్రామస్థులు, పక్క గ్రామాల నుండి ప్రజలు అధికంగా వచ్చి వారి బలగంతో కలిసి బలగం సినిమా వీక్షించారు.ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి 15 నిమిషాలు కన్నీటి పర్యంతం ఐయ్యారు.

ఎంతైనా బలగం సినిమా….చూసిన ఆ ఊరి అందరి బలగలని దగ్గర చేసింది.

రక్త సంబంధాలను మర్చిపోతున్న ఈ కాలంలో బలగం చిత్రం రక్తసంబంధాలను కన్నులకు కట్టినట్టు చూపించిన నేపథ్యంలో ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు.తన అన్నదమ్ములను, అక్కాచెల్లెలను రక్తసంబంధాలను గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube