రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం( Gambhiraopet ) ముస్తఫా నగర్ గ్రామంలో మిషన్ భగీరథ పేరు చెప్పుకొని గ్రామంలో ఉన్న నలుమూలల నాలుగు పాడైపోయిన బోర్లను వాటిని పట్టించుకోకుండా మరమ్మతులు చేయక , ముస్తఫా నగర్ లో చెత్త సేకరణ చేయక కనీసం 20 రోజులు అవుతుందని,గత వారం రోజులు నుండి నీటి సమస్య ఉందని గ్రామపంచాయతీ సిబ్బంది గానీ స్థానిక ఎంపీడీవో కి ముస్తఫానగర్ గ్రామపంచాయతీ యొక్క చెక్ పవర్ ఉన్నందున వారు కూడా సంబంధిత అధికారి పంచాయతీ కార్యదర్శి రాజు కూడా పట్టించుకోని ఎడల ముస్తఫా నగర్ గ్రామ మహిళ సోదరులు అందరూ కాళీ బిందెలతో రోడ్డు ఎక్కి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారికి మద్దతుగా ముస్తఫా నగర్ గ్రామ విలేజ్ కమిటీ అధ్యక్షులు దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్, ఉపాధ్యక్షులు గౌరీ గారి నాగరాజు గౌడ్( Nagaraju Goud ), సభ్యులు శివని దేవేందర్, చిలుక ఎల్లం, ఎండి అక్బర్ ఖాన్, తిరుపతి, బాబు, రాజా రమేష్ యాదవ్, గంభీరావుపేట విలేజ్ కమిటీ అధ్యక్షులు మేకర్తి శ్రీనివాస్ మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.
స్థానిక గంభీరావుపేట ఎంపీడీవో వచ్చి వారి సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది