ఎన్నికల కోడ్ ఉల్లంఘించి దిష్టిబొమ్మల దహనం.. పట్టించుకోండి ఎలక్షన్ కమిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రైతు బంధు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేసిన విషయాన్ని ఖండించారు.గత 2018 ఎన్నికల్లో కూడ రైతుబంధు ఆపాలని లేఖ రాసారని ముమ్మర ప్రచారం మేము అడ్డుపడలేదనీ ఇప్పుడు కూడా బలహీన పడుతున్నాం గెలిచే అవకాశం లేదని కావాలని భూమిలేని కర్ణాటక రైతులను కిరాయికి తెచ్చి డ్రామాలాడుతున్న బి.ఆర్.ఎస్ , బీజేపీ పార్టీలు లను రైతు బంధు కాంగ్రేస్ పార్టీ ఇవ్వొద్దని చెప్పలేదని ఇవ్వాలనుకుంటే ఈ పది రోజుల్లో ఇవ్వండి కానీ పోలింగ్ కు ముందు రోజులు ఇవ్వడం సరికాదు అని మాత్రమే పేర్కొన్నాం అని తెలిపారు.

 Brs Burning Effigies Of Congress Party In Violation Of Election Code, Brs ,congr-TeluguStop.com

అది పక్కన పెట్టి కొత్త డ్రామాకు తెరలేపారు.మా యొక్క హామీలను చూసి డబ్బింగ్ కొట్టిన ప్రభుత్వం వాళ్ళు ఇస్తామని చెబుతున్నారు.సంక్షేమానికి ఎలా ప్రాముఖ్యం కల్పించాలి కాంగ్రేస్ పార్టీకి తెలుసునీ ఉచితం సముచితం కాదని వాదిస్తున్నారు కొందరు మేము ఉచితం ఇచ్చేది కేవలం వారి ఆర్థిక పరిస్థితికి చేయూత నివ్వడమే కానీ కూర్చుండపెట్టి సాదూతం అనడం లేదని వందల ఎకరాల భూస్వాములకు కోట్లు ఇచ్చి భూమి లేని కూలీలకు, కౌలు రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వం తరిక మేము చెయ్యం కాబట్టే నిజమైన వ్యవసాయ దారులకు ఇస్తామంటున్నాం అన్నారు.

గుట్టలకు,పుట్టలకు రైతు బంధు ఇచ్చుడు కాదు.

కౌలు రాసుకున్న ప్రతి రైతుకు న్యాయం చేస్తామంటున్నాం.రైతు కూలీలకు అన్ని కాలాల్లో ఉపాధి ఉండదు కాబట్టి భరోసా ఇస్తున్నాం.

ఉప్పుతో తొమ్మిది గతములో ఇచ్చాము అదే తరహాలో వారికి ప్రస్తుత రేటు ప్రకారం నగదు బదిలీ రూపేన ప్రతి కుటుంబ మహిళకు ఆర్థికంగా చేయూత నిస్తున్నాం.గతములోనే బిపిఎల్ కుటుంబాలకు పది శాతం రాయితీ ఆర్,టిసి బస్సుల్లో ఇచ్చిన చరిత్ర మాకుంది.ఓనమాలు నేర్చే పిల్ల నుండి డిగ్రీ చదివే ఆడపిల్లలకు 35 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం యిచ్చినం.60 యేండ్లు దాటినా వృద్దులకు సగం రేటుతో ప్రయాణించే అవకాశాన్ని ఇచ్చినాం అనుకూలంగానే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు

మేము ఏది అనాలోచితంగా పథకాలు ప్రకటించలేదని అన్ని ఆలోచించే ఇస్తున్నాం మల్లి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వములో ఇచ్చి తీరుతాం మాకు వాయిదా పద్ధతులు, వాయినాల పద్ధతులు ఉండవ్ అందరికి సామాన్యంగా ఒకే సారి వర్తింపజేస్తాం అధికారి సంతకాలు ప్రొసిడింగ్ చూపెట్టి మీరు గృహలక్ష్మి పేరున మభ్యపెడుతున్నారు మేము వచ్చాక వీరితో పాటు అర్హులందరికీ , ఇళ్లునిర్మాణం మొదలు పెడితే చాలు ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇచ్చి తీరుతాము అని జబ్బచరిచి చెబుతున్నాం మీకు దమ్ముంటే ఎన్ని రోజుల్లో ఎంతమందికి ఇస్తారో చెప్పండి.మాయమాటలు సెంటిమెంట్లకు ఇయ్యాల రేపు ఆశపడి బయటపడి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని పసుల వెంకటి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube