ఉత్తరాఖండ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం అయింది.ఉత్తరకాశీ జిల్లా పురోలాలో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
ఈ క్రమంలోనే పట్టణంలో ఉన్న ఎనిమిది దుకాణాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని అధికారులు తెలిపారు.
అయితే, ఏటీఎం కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ.24 లక్షలు జమ చేసినట్లు తెలుస్తోంది.నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత జమ చేశారన్న వివరాలు తెలియలేదు.ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.







