సరస్వతి ఆకు..
( Saraswati leaf ) ఈ పేరు వినే ఉంటారు.సరస్వతి ఆకును చాలా మంది బ్రహ్మి ఆకు అని కూడా పిలుస్తుంటారు.
ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకును ఎక్కువగా వాడుతారు.అనేక జబ్బులకు చెక్ పెట్టేందుకు సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే పిల్లల ఆరోగ్యానికి కూడా సరస్వతి ఆకు చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా సరస్వతి ఆకును ప్రతిరోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా పిల్లలకి ఇస్తే ఇక వారి ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
![Telugu Brahmi, Tips, Latest, Saraswati Leaf, Saraswatileaf-Telugu Health Telugu Brahmi, Tips, Latest, Saraswati Leaf, Saraswatileaf-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/09/latest-news-health-health-tips-good-health-kids-Centella-asiatica-brahmi-leaves.jpg)
అందుకోసం ముందుగా సరస్వతి ఆకులను బాగా ఎండ పెట్టుకోవాలి.పూర్తిగా ఎండిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు( Cows milk ) తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ సరస్వతి ఆకు పొడి, చిటికెడు మిరియాల పొడి, రుచికి సరిపడా పటిక బెల్లం( Patika Bellam ) పొడి వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ పాలను పిల్లల చేత తాగించాల
![Telugu Brahmi, Tips, Latest, Saraswati Leaf, Saraswatileaf-Telugu Health Telugu Brahmi, Tips, Latest, Saraswati Leaf, Saraswatileaf-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/09/saraswati-leaf-saraswati-leaf-health-benefits-Patika-Bellam-latest-news-health-health-tips-good-health-kids-Centella-asiatica-brahmi-leaves.jpg)
ఈ విధంగా కనుక సరస్వతి ఆకును ప్రతి రోజు పిల్లలకు ఇస్తే వారి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.పిల్లలకు నత్తి సమస్య ఉంటే దూరం అవుతుంది.
అలాగే చాలా మంది పిల్లల్లో సరిగ్గా ఆకలి ఉండదు.దీంతో ఏం పెట్టినా తినమని మారాం చేస్తుంటారు.
అలాంటి వారికి సరస్వతి ఆకును పైన చెప్పిన విధంగా ఇస్తే ఆకలి చక్కగా పెరుగుతుంది.అదే సమయంలో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది.
ఎముకలు దృఢంగా ఎదుగుతాయి.ఇక పిల్లల్లో అధికంగా తలెత్తే సమస్యల్లో రక్తహీనత ఒకటి.
అయితే సరస్వతి ఆకు రక్తహీనతను చాలా త్వరగా దూరం చేస్తుంది.అందుకోసం మిక్సీ జార్ లో ఐదు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు, చిటికెడు మిరియాల పొడి, నాలుగు సరస్వతి ఆకులు మరియు కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై జ్యూస్ ను సపరేట్ చేసుకొని తేనె కలిపి పిల్లలకు పాటించాలి.ఇలా చేస్తే రక్తం వృద్ధి చెందుతుంది.
రక్తహీనత దూరం అవుతుంది.