ఇవాల్టి నుంచి శబరిమలై ఆలయం మూసివేత

హైదరాబాద్: డిసెంబర్ 27 శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఈరోజు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

 Sabarimalai Temple Was Closed From Today, Sabarimalai Temple , Sabarimalai Templ-TeluguStop.com

భారీ సంఖ్యలో భక్తుల సందర్శనతో ఆలయం సందడిగా కనిపించిన ఈ పూజాకాలం ముగిసింది.

ఈ నెల 30న తిరిగి ఆలయద్వారాలు తెరుచుకోనున్నాయి.మండల పూజాకాలంలో శబరిమల ఆలయాన్ని దాదాపు 32.50 లక్షల మంది భక్తులు దర్శించు కున్నారు.

అయ్యప్ప స్వామి ఆశీస్సు లు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివ చ్చారు.

జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకో నున్నారు.

ఈ ప్రత్యేక ఘట్టానికి దేశ వ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు.

మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.ఇక జనవరి 20న పడి పూజతో శబరిమల యాత్ర ముగియనుంది.

ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు.సంప్ర దాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగు తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube