హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పై వివాదం ముదురుతోంది.ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సన్ బర్న్ ఈవెంట్ కు ఓ వ్యక్తి బుక్ మై షోలో టికెట్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని మాదాపూర్ అదనపు డీసీపీ తెలిపారు.అలాగే బుక్ మై షో ఎండీ, నోడల్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు.
సన్ బర్న్ లాయల్టీని వాడుకొని ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.