ప్రజల అవసరాలకు అనుగుణంగా కోర్టుల విస్తరణ అవసరమని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.సిబ్బంది కొరత కారణంగా కేసుల పరిష్కారం నెమ్మదిగా సాగుతోందని తెలిపారు.
కేసుల తాత్సారంతో ప్రజల్లో అసహనం పెరుగుతోందని సీజే ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.కేసుల సంఖ్య పెరిగిపోవడం న్యాయవ్యవస్థకు మంచిది కాదని చెప్పారు.
బార్, బెంచ్ లు రెండూ న్యాయవ్యవస్థకు చక్రాలని తెలిపారు.ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ విధులు నిర్వర్తిస్తే న్యాయ వ్యవస్థపై సమాజంలో నమ్మకం పెరుగుతుందని వెల్లడించారు.