ఎండాకాలం( summer )లో చాలామంది ప్రజలు చల్లని నీరు త్రాగడానికి ఇష్టపడుతుంటారు.అయితే చల్లని నీరు తాగడం తప్పు కాదు కానీ ఫ్రిజ్లో ఉంచిన నీటిని తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది మన శరీర ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు.చల్లటి నీరు వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కానీ ఫ్రిజ్లో ఉంచిన నీరు ఆరోగ్యానికి హాని చేస్తుందని చెబుతున్నారు.ఆహారం తిన్న వెంటనే చలనీరు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇది జీర్ణ క్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఎప్పుడు చల్లని నీరు త్రాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
చల్లటి నీరు( cold water ) తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి.దీని వల్ల కడుపు నొప్పి( Stomach ache ) ఎక్కువవుతుంది.
చల్లని నీరు గుండెలోని వాగాస్ నరాల మీద ప్రభావం చూపుతుంది.ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది.
ఇది గుండెపోటుకు దారితీస్తుంది.
ఇంకా చెప్పాలంటే చల్లటి నీరు త్రాగడం వల్ల గొంతులోని రక్షిత పొరపై ప్రతికూల ప్రభావం పడుతుంది.దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.మట్టి కుండలోని నీరు తాగితే మంచిది.
కానీ ఫ్రిజ్లోని కూల్ వాటర్ ఏ సీజన్లో కూడా మంచిది కాదు.ఫ్రిడ్జ్ లోని చల్లని వాటర్ ఎక్కువగా త్రాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్ తగ్గిపోతుంది.
దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అన్నం తిన్న వెంటనే చల్లని నీరు అసలు తాగకూడదు.
శరీరంలో కొవ్వు బయటకు అసలు పోదు.కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎండాకాలంలో ఎక్కువగా ఫ్రిజ్లోని చల్లని నీరు త్రాగే బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.