అలా చేసి ఉంటే వాల్తేరు వీరయ్య రిజల్ట్ మారేదా.. పరుచూరి రివ్యూ ఇదే!

2023 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే నిర్మాతలకు భారీ రేంజ్ లో లాభాలు మిగిలాయి.

 Paruchuri Gopalakrishna Review About Waltheir Veeraiah Movie Details Here , Paru-TeluguStop.com

ఈ సినిమా గురించి ప్రముఖ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopalakrishna ) ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈ సినిమాను ఓటీటీలో వీక్షించిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ సాధించిన సమయంలో ఎంతగా సంతోషించానో మూవీ చూస్తున్న సమయంలో సైతం అదే సంతోషాన్ని పొందానని తెలిపారు.

కొన్ని సినిమాలు మనల్ని వెంటాడతాయని వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం మళ్లీమళ్లీ చూడాలనిపించే సినిమా అని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు.దర్శకుడు బాబీ ఈ సినిమాను కరెక్ట్ గా తెరకెక్కించాడని ఆయన తెలిపారు.

ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి అందరూ షాకవుతారని క్లైమాక్స్ లో వచ్చే మెసేజ్ చప్పట్లు కొట్టిస్తుందని పరుచూరి చెప్పుకొచ్చారు.రవితేజ రోల్ ను చరణ్ చేసి ఉంటే సినిమా బాగోదని ఆయన పేర్కొన్నారు.చరణ్ కు అన్యాయం జరిగినట్టు చూపిస్తే చిరంజీవి( Chiranjeevi ) రోల్ కు నెగిటివ్ అయ్యేదని పరుచూరి కామెంట్లు చేశారు.సినిమాలో చిరంజీవి వర్టిగో వ్యాధి ఉందని చెప్పే విధానం ఆకట్టుకుందని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమా చూస్తున్న సమయంలో 25 ఏళ్ల క్రితం చిరంజీవి గుర్తుకు వచ్చాడని పరుచూరి చెప్పుకొచ్చారు.ఊహకు అందని ట్విస్టులు, డైలాగ్స్ తో ఈ సినిమా సాగిందని పరుచూరి కామెంట్లు చేశారు.

సినిమాలో కేథరిన్, ప్రకాష్ రాజ్ రోల్స్ బాగున్నాయని వారి పాత్రలు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube