Jayanthi Kantarao: జయంతి కి సినిమాలు ఇప్పించడం కోసం పెద్ద యుద్ధమే చేసిన హీరో

జయంతి.( Jayanthi ) మొదట హీరోయిన్, డ్యాన్సర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితం.

 Relation Between Kantharao And Jayanthi-TeluguStop.com

ఆమె ముగ్ద మనోహరమైన రూపం, చక్కటి మాట తీరు, వినసొంపైన గొంతు అన్ని కలిసి ఆమెను తొలినాళ్లలో చాల మందికి స్పెషల్ గా ఉండేలా చేసింది.అయితే జయంతి మొదట హీరోయిన్ గా బాగానే చేసిన ఎందుకో మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే వెనకబడింది.

అందుకే కొన్నాళ్ల పాటు ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు.దాంతో జయంతి గ్రూప్ డ్యాన్సర్ గా చేయడానికి ఒప్పుకొని కొన్ని రోజుల పాటు ఆ పని కూడా చేసింది.

ఇది ఆమె పాలిట శాపం అయ్యింది.

Telugu Anu Prabhkar, Devika, Jayanthi, Kantharao, Krishna Kumar, Sandalwood-Movi

ఆ తర్వాత ఆమె మళ్లి సినిమాల్లో కనిపించడం గగనం అయిపొయింది.చిన్న చితక వేషాలు అయినా రాలేదు.గ్రూప్ డ్యాన్సర్ గా చేసింది అంటూ పలువురు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిరాకరించారు.

ఇక ఆమె పట్ల మొదటి నుంచి అమితమైన అభిమానం ఉన్న నటుడు కాంతారావు( Actor Kantharao ) అయన తీసే ప్రతి సినిమా లో జయంతి ని రిఫర్ చేయడం మొదలు పెట్టారు.దేవిక మరియు కాంతారావు చాల సినిమాల్లో కలిసి నటించగా వీరికి మంచి హిట్ పెయిర్ అనే పేరు ఉండేది.

ఆ సినిమాల్లో జయంతి కి ఎదో ఒక రోల్ ఉండేలా దర్శకులతో పేచీ పెట్టుకునేవాడు.ఇక దేవిక మరియు కాంతారావు నటించిన అపూర్వ చింతామణి( Apoorva Chintamani Movie ) సినిమాలో కూడా జయంతికి అవకాశం ఇవ్వాలని ఆ సినిమా డైరెక్టర్ అయినా లాల్ తో గొడవకు దిగాడు కాంతారావు.

Telugu Anu Prabhkar, Devika, Jayanthi, Kantharao, Krishna Kumar, Sandalwood-Movi

కానీ తన సినిమాలో ఒక గ్రూప్ డ్యాన్సర్ కి కీ రోల్ ఇవ్వను అని డైరెక్టర్ పంతం పట్టాడు.ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.ఇండస్ట్రీ మొత్తం కాంతారావు జయంతి కోసం దర్శకులతో గొడవకు దిగుతున్నాడు అని తెలిసిపోయింది.మిగతా వారితో లేని ఈ ఆసక్తి ఒక్క జయంతి విషయంలోనే ఎందుకు అని చెవులు గొణుక్కునే వారు.

కొన్ని రోజులకు అన్ని సమస్యలు తొలగిపోయి ఆమె చివరి రోజుల వరకు కూడా నటిస్తూ వచ్చారు.ఇక జయంతి సైతం అప్పట్లోనే మూడు వివాహాలు చేసుకుంది.ఆమెకు ఒక కొడుకు కృష్ణ రావు ఉన్నాడు.ఇక కోడలు అను ప్రభాకర్ కూడా నటీమణి కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube