హైదరాబాద్ లో( Hyderabad ) మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.గచ్చిబౌలిలోని( Gachibowli ) ఓ స్టార్ హోటల్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్( Drugs ) పట్టుబడింది.
ఈ క్రమంలోనే బీజేపీ నేత కుమారుడితో( BJP Leader Son ) పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
వీరిలో ప్రముఖ రాజకీయ నేత, వ్యాపారవేత్త కుమారుడు వివేకానంద( Vivekananda ) ఉన్నారని సమాచారం.అయితే వివేకానంద హైదరాబాద్ నగరంలో పలు మాల్స్,హోటల్స్ ను నిర్వహిస్తున్నారు.స్టార్ హోటల్ లో అర్థరాత్రి జరిగిన వీకెండ్ పార్టీలో ఎస్ఓటీ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు.అలాగే ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.