Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టార్ హోటల్ లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో( Hyderabad ) మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.గచ్చిబౌలిలోని( Gachibowli ) ఓ స్టార్ హోటల్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్( Drugs ) పట్టుబడింది.

ఈ క్రమంలోనే బీజేపీ నేత కుమారుడితో( BJP Leader Son ) పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

"""/" / వీరిలో ప్రముఖ రాజకీయ నేత, వ్యాపారవేత్త కుమారుడు వివేకానంద( Vivekananda ) ఉన్నారని సమాచారం.

అయితే వివేకానంద హైదరాబాద్ నగరంలో పలు మాల్స్,హోటల్స్ ను నిర్వహిస్తున్నారు.స్టార్ హోటల్ లో అర్థరాత్రి జరిగిన వీకెండ్ పార్టీలో ఎస్ఓటీ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

"""/" / ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు.

అలాగే ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆ వివాదం తేలకుండానే కన్ను మూసిన లత మంగేష్కర్‌.. చివరికి..!