తెలంగాణలో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుపై : సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: జూన్ 24 విద్యార్థుల కోసం సరికొత్త స్కీం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.

 Establishment Of Integrated Residential Schools In Telangana Cm Revanth Reddy Re-TeluguStop.com

సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దీనిపై ప్రభుత్వం.

లోతుగా సమీక్ష జరిపింది.గత ప్రభుత్వం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేరు వేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయ గా.ఇప్పుడు వాటన్నింటి ఒకే ప్రాంగణంలోకి తీసుకు రావాలన్న సంచలన నిర్ణయం చేస్తోంది.ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో వచ్చే ఆచర ణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించారు.

విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూల తలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

విద్యార్థులకు అవసరమయ్యే.తరగతి గదులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, సిబ్బందికి క్వార్టర్స్ తదితరాలన్నింటిపై సూదీర్ఘంగా చర్చించారు.

ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా.అన్నింటినీ ఒకేలా డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.

ఆ ప్రకారమే అధికారులు కొన్ని డిజైన్లు సిద్ధం చేయగా.వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి తదితరులు పరిశీలించారు.

ఈ కొత్త పథకానికి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.మొదట ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఈ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube