ఇవాల్టి నుంచి శబరిమలై ఆలయం మూసివేత

హైదరాబాద్: డిసెంబర్ 27 శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజలు ముగియడంతో అధికారులు ఈరోజు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

భారీ సంఖ్యలో భక్తుల సందర్శనతో ఆలయం సందడిగా కనిపించిన ఈ పూజాకాలం ముగిసింది.

ఈ నెల 30న తిరిగి ఆలయద్వారాలు తెరుచుకోనున్నాయి.మండల పూజాకాలంలో శబరిమల ఆలయాన్ని దాదాపు 32.

50 లక్షల మంది భక్తులు దర్శించు కున్నారు.అయ్యప్ప స్వామి ఆశీస్సు లు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివ చ్చారు.

జనవరి 14న శబరిమల కొండపై భక్తులు మకరజ్యోతిని దర్శించుకో నున్నారు.ఈ ప్రత్యేక ఘట్టానికి దేశ వ్యాప్తంగా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు.

మకరజ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.ఇక జనవరి 20న పడి పూజతో శబరిమల యాత్ర ముగియనుంది.

ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగించుకుంటారు.

సంప్ర దాయబద్ధంగా నిర్వహించే ఈ పూజతో యాత్రకు పూర్తి స్థాయి ముగింపు కలుగు తుంది.

అంతరిక్షంలో ఒకే రోజు 16 సూర్యోదయాలు.. సునీతా విలియమ్స్‌కి అద్భుతమైన అనుభవం!