టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.ఈ క్రమంలో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లనున్నారు.
రేపు ఉదయం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్న చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.రేపు మధ్యాహ్నం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకోనున్నారు.
కాగా ముందుగా ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలు దేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలిసిందే.