తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు.ఈ మేరకు ఇవాళ బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం అయ్యారు.ఈ భేటీకి డీజీపీ, అడిషనల్ డీజీ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో పోలింగ్ నిర్వహణతో పాటు లా అండ్ ఆర్డర్ పై శిక్షణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రతపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
కాగా అక్టోబర్ లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై వీఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది.
మరోవైపు రాబోయే ఎన్నికల నేపథయంలో ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికలను సమర్పించాలని సూచించారు.