కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇవాళ పిటిషన్ పై విచారణ చేయాలని హైకోర్టు వెకేషన్ బెంచ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ముందస్తు బెయిల్ పై తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ లో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ అవ్వనున్నారు.
ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.