హైదరాబాద్ నగరంలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.పౌరులకు మరింత సేవలు అందించేందుకే వార్డు కార్యాలయాలని తెలిపారు.ప్రతి వార్డుకు అధికారి, వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది ఉంటారన్నారు.2014తో పోలిస్టే 4500 మెట్రిక్ టన్నుల చెత్తను అధికంగా సేకరిస్తున్నామని పేర్కొన్నారు.ఆగస్టు చివరి కల్లా హైదరాబాద్ లో ఉత్పత్తయ్యే మురుగును పూర్తిగా శుద్ధి చేస్తామని చెప్పారు.రోడ్ల నిర్వహణ, నాలాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు.ఈ-గవర్నెన్స్ లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు.
హైదరాబాద్ లో నాలాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
Special Focus On Development Of Canals In Hyderabad