హైదరాబాద్ లో పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.పాతబస్తీలోని బండ్లగూడలో బ్లాస్ట్ సంభవించింది.
కెమికల్ డబ్బా ఒక్కసారిగా పేలడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడని తెలుస్తోంది.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న ఇంటి సెల్లార్ వద్ద ప్రమాదం జరిగిందని సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ క్రమంలోనే మృతుడు షకీల్ గా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.