తెలంగాణ రాష్ట్రాన్ని పనికిస్తున్న చలి పులి

హైదరాబాద్‌:డిసెంబర్ 13తెలంగాణ రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తోంది.రాష్ట్రం లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ రించింది.

 The State Of Telangana Is Shivering With Cold , Telangana, Temperatures , Me-TeluguStop.com

రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధి కంగా ఉంటు-ందని స్పష్టం చేసింది.రెండ్రో జులుగా కిందిస్థాయి నుంచి తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి.

మరో రెండ్రో జులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తెలిపింది.ఆ తరువాత రాష్ట్రంలో చలి సాధారణ స్థితికి వచ్చే అవ కాశం ఉందని వాతా వరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.

డిసెంబరు ఆఖరి వారం నుంచి రాష్ట్రం లో చలి తీవ్రత పెరగడంతో పాటు ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తా యన్నారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు( Temperatures ) సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

హైద రాబాద్‌ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపో యాయి.

పగటి పూట ఉష్ణో గ్రతలు కూడా సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య అత్య ల్పంగా నమోదవు తున్నాయి.రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్‌ జిల్లా( Medak )లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా కరీంనగర్ పెద్దపెల్లి జిల్లాలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో( Khammam district ) 31 డిగ్రీలు, అత్య ల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్‌.శివారు ప్రాంతాల్లో ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో రాబోయే రోజుల్లో ఉష్ణో గ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతా వరణ కేంద్రం హెచ్చ రించింది.పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే సూచనలున్నాయని పేర్కొంది.

ఆకాశం నిర్మ లంగా ఉంటు-ందని విెవరించింది.వారం రోజుల పాటు తుఫానులు ఏర్పడే పరిస్థితులు లేవని తెలిపింది.

డిసెంబర్‌ 19 వరకు తెలంగాణతోపాటు- ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది.ప్రస్తుతం మాల్దీవుల వద్ద ఉపరితల ఆవర్తనం ఉందని, దాంతో తెలుగు రాష్ట్రాల్రపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube