వ‌ర్షాకాలంలో వేపాకులు మ‌న‌కు ఎన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా?

వేప చెట్టు నుండి వ‌చ్చే అద్భుత‌మైన ఔష‌ధాల్లో వేపాకులు ఒక‌టి.రుచికి చేదుగా ఉన్నా వేప ఆకుల్లో మాన‌వుడి శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.

 Wonderful Benefits Of Neem Leaves In Rainy Season  Benefits Of Neem Leaves, Rain-TeluguStop.com

అందుకే పూర్వ కాలం నుండే వేపాకుల‌ను ఆయుర్వేద వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు.అలాగే వేప ఆకులు అనేక‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సైతం అందిస్తాయ‌ని నిపుణులు చెబుతుంటారు.

అందులోనూ ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో వేపాకులు మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

వ‌ర్షాలు, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా చాలా మంది ఈ సీజ‌న్‌లో దుర‌ద‌, అల‌ర్జీ, ర్యాషెస్‌, మొటిమ‌లు వంటి ర‌క‌ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.

వాటికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి వేపాకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అందుకోసం రెండు గ్లాసుల‌ వాట‌ర్‌లో గుప్పెడు వేపాకులు వేసి బాగా మ‌రిగించి.నీటిని ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ నీటిని స్నానం చేసే వాట‌ర్‌లో క‌లిపి బాత్ చేయాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే ఆయా చ‌ర్మ స‌మ‌స్య‌లను వ‌దిలించుకోవ‌చ్చు.

అలాగే రెండు లేదా మూడు వేపాకుల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి తినాలి.

ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఇలా చేస్తే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంది.దాంతో సీజ‌న‌ల్‌ వ్యాధులు, వైర‌ల్ ఫీవ‌ర్స్‌ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఖాళీ క‌డుపుతో వేపాకుల‌ను న‌మిలి తింటే.బ్లెడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.దంతాలు దృఢంగా మార‌తాయి.

Telugu Benefits Neem, Tips, Latest, Neem, Rainy Season, Skin Care-Telugu Health

వ‌ర్షాకాలంలో చాలా మంది శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు.అలాంటి వారు వేపాకుల‌తో టీ త‌యారు చేసుకుని సేవించాలి.త‌ద్వారా శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌రియు వేపాకు టీ తీసుకోవ‌డం వ‌ల్ల‌ జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి స‌మ‌స్య‌ల నుండి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube