టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసార. ఈ సినిమాతో విశిష్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించడంతోపాటు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.
ఇందులో సంయుక్త మీనన్, కేథరీన్ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ఆ విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదలకు తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్కొక్కటి అప్డేట్ ను వదులుతున్నారు.
ఇందులో బంగనే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సంయుక్త మీనన్ హీరో కళ్యాణ్ రామ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కదా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది అలాగే ఆమె కెరీర్ కు కూడా ప్లస్ అయ్యింది అని తెలిపింది.అదేవిధంగా కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్, కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి పెద్ద స్టార్లతో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపింది.
అనంతరం బింబిసారా సినిమా గురించి మాట్లాడుతూ.ఈ సినిమా ఓ టైమ్ ట్రావెల్ మూవీ అని,ప్రస్తుతం కాలంలో అలాగే చాలా ఏళ్ల క్రితం జరిగిన కథతో సినిమా నడుస్తుందని ఆమె తెలిపింది.
అయితే ప్రజెంట్ లో జరిగే కథలో మోడరన్ యువతిగా తాను నటిస్తున్నట్లు ఆమె తెలిపింది.ఈ సినిమాలో తనది సింపుల్ రోల్ కావడంతో ఎక్కువ కష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చింది.
కళ్యాణ్ రామ్ కళ్లతోనే భావాలను పలికిస్తారని.బింబిసార సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ఫస్ట్ డే రాజు గెటప్‌లో ఆయన కనిపించారని, ఓ సీన్‌లో ఆయన చూపును చూస్తే నిజం రాజులానే పాత్రలో లీనమైపోయాడుగా అనే ఫీలింగ్ కలిగింది అని చెప్పుకొచ్చింది.ఆ తరువాత కళ్యాణ్ రామ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ కళ్యాణ్ రామ్‌ది ఓ భిన్నమైన బాడీ లాంగ్వేజ్ అని చెప్పిన సంయుక్త మొదటి రోజు తన వద్దకు వచ్చి మీరు మా ప్రాజెక్టులో భాగం కావడం గర్వంగా భావిస్తున్నామని చెప్పడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపింది.అది కళ్యాణ్ రామ్ మంచితనానికి నిదర్శనం అని చెబుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది సంయుక్త మీనన్.