తులసి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తులసి ఆకులను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మాత్రమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు తులసి నీరు ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలగిపోతాయి.
దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను కూడా ఇది అదుపులో ఉంచుతుంది.ముఖ్యంగా ఈ ఆకులను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అసలు పెరగదు.

వర్షాకాలంలో పసుపు, తులసి ఆకుల కాషాయాం త్రాగడం వల్ల ఆరోగ్యం ఎంతో మంచిది.దీని వల్ల జలుబు, గొంతు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.ప్రతి రోజు ఖాళీ కడుపుతో తులసి నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కడుపులో ఆమ్లత్వం గనుక ఉంటే ప్రతి రోజు మూడు తులసి ఆకులను నమిలి మింగాలి.అలాగే కొబ్బరి నీరు, నిమ్మరసం, తులసి ఆకులు కలిపి తాగిన కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.తులసి ఆకులతో టీ లేదా కాషాయం చేసి తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.ఇంకా తులసి మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.
జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.ప్రతిరోజు తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల ఇది చర్మం పై ఏర్పడిన మచ్చలు ముడతలను రాకుండా చేస్తుంది.
తులసి నీరు రావడం వల్ల కఫం సమస్య తగ్గిపోతుంది.కాళ్లు పగుళ్లు మరియు పాదాల సమస్యలతో బాధపడేవారు ఒక తొట్టి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి అందులో పాదాలను ఉంచడం వల్ల పాదాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.