నిరుపేద చిన్నారికి ఆర్థిక సహాయం అందించిన : సెస్ సిబ్బంది

Financial Assistance Provided To Underprivileged Children By Cess Staff, Financial Assistance , Underprivileged Children ,Cess Staff, Ellareddy Peta, Akula Murali Goud

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆగుళ్ల భాస్కర్ 27 అనే యువకుడు గుండెపోటుతో మరణించగా మృతునికి భార్య రెండు సంవత్సరాల పాప ఉంది.పేదరికంలో జీవనం సాగిస్తున్న కుటుంబంలో భర్త చనిపోగా భార్యకు జీవనాధారం లేకుండా సరికి బిడ్డను తన అత్త మామ అగుల్ల అడవయ్య -సావిత్రిల వద్ద వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

 Financial Assistance Provided To Underprivileged Children By Cess Staff, Financ-TeluguStop.com

బాలికకు తల్లి తండ్రి లేకుండా అనాధగా తాతయ్య,నానమ్మ వద్ద దీనస్థితిలో బ్రతుకుతుంది.

పూరిగుడిసెలో జీవనం సాగిస్తూ పురవీధుల్లో ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ బ్రతుకుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నింపింది.

సమాచారం తెలుసుకున్న సామాజిక సేవాకర్త బీ ఆర్ ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి గౌడ్ బియ్యాన్ని వితరణ చేసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసే దాతలు ముందుకు రావాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయగా ఎల్లారెడ్డిపేట సెస్ సిబ్బంది మంగళవారం వారు నివసిస్తున్న పూరిగుడిసెకు వెళ్లి చిన్నారి తాత అడవయ్య నానమ్మ సావిత్రిలకు కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube