బెల్లం తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఈ మధ్యకాలంలో చాలామంది పంచదారకి అలవాటు అయిపోయారు.ఒకప్పుడు తీపి అంటే కేవలం బెల్లం( Jaggery ) వాడేవారు.

 Health Benefits Of Eating Jaggery,jaggery,knee Pains,jaggery Benefits,sweet,bloo-TeluguStop.com

పంచదార పక్క రిఫైండ్ ఆహారం.దీన్ని పోషకాలని తొలగిపోయి, రుచి మాత్రమే మిగిలేలా శుద్ధి చేసిన పదార్థాన్ని చక్కెర అంటారు.

కానీ బెల్లం మాత్రం అలా కాదు.బెల్లం లో పీచు పదార్థం ఉంటుంది.

ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది.అలాగే మలబద్దకంతో బాధపడుతున్నట్లయితే మలబద్ధకం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

బెల్లం లో జింక్, సెలీనియం ఉండడం వలన ఒంట్లోని వ్యర్థాలను వదిలించే డిటాక్స్ లా కూడా పనిచేస్తుంది.

Telugu Sugar Levels, Tips, Jaggery, Knee, Liver, Sweet-Telugu Health

దీంతో కాలేయాన్ని( Liver ) ఆరోగ్యంగా ఉంచుతుంది.కఫ సంబంధ వ్యాధులకు చెక్ పెట్టి, ఊపిరితిత్తులకు బెల్లం బాగా మేలు చేస్తుంది.ముఖ్యంగా శీతాకాలం నీటిలో ఒక చెంచాడు బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

దీనికి వెంటనే చల్లబరిచే గుణం కూడా ఉంటుంది.కాబట్టి బెల్లం పాకం తాగమని సూచిస్తూ ఉంటారు.

ఇక బెల్లాన్ని రామనవమికి కూడా ఓ సాంప్రదాయంగా మార్చారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక బెల్లంతో పాటు కాస్త అల్లం, నువ్వులు, నెయ్యి కలిపి మిఠాయి తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.

Telugu Sugar Levels, Tips, Jaggery, Knee, Liver, Sweet-Telugu Health

దీంతో కీళ్ల నొప్పులు( Knee Pains ) కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇక బెల్లం లో ఐరన్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి.ఇవి రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటాయి.అలాగే రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం కూడా ఉంటుంది.ఇక కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్లయితే బెల్లం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ఇక భోజనం తర్వాత మిఠాయి తీసుకునే అలవాటు ఉన్నవారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలా మేలు జరుగుతుంది.

ఇక షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube