జిల్లా పోలీస్ కార్యక్రమంలో,పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో,పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని శాలువా కప్పి సన్మానించి మహిళల ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 International Women's Day Celebrations In The District Police Programme, Police-TeluguStop.com

అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు.

శక్తిసామర్ధ్యాలలో, అభివృద్ధిలో నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి వంటింటికే పరిమితం కాకుండా అంతరిక్ష పరిశోధన నుంచి భూగర్భల వరకు మేటి విలువలతో విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూనే మేలైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు అన్నారు.నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు కుమారస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు మహిళ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube