మద్యం సేవించడం మానలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలను..?

ప్రస్తుత రోజులలో మద్యం ( alcohol )సేవించని వారు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే మద్యం సేవించడం అనేది ప్రతిరోజు భోజనం చేసేలాగా మారిపోయింది.

 Can't Stop Drinking Alcohol  But These Tips ,   Alcohol  ,  Drinking Alcohol,-TeluguStop.com

దీన్ని ఒక్క రోజు కూడా సేవించకుండా చాలామంది ఉండలేకపోతున్నారు.అయితే ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ రోజు తాగితే మాత్రం ఎంత ప్రమాదమో దాదాపు చాలామందికి తెలుసు.

ఒకవేళ మద్యం సేవించడం ( Drinking alcohol )మానుకోవాలనుకునేవారు ఈ చిన్న చిట్కాలను ప్రయత్నించండి.మద్యం సేవించడం మానేయాలనుకుంటే అసలు ఎందుకు తాగుతున్నారు? ఏ సమయంలో తాగుతున్నారో ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Telugu Alcohol, Energy Drinks, Problems, Tips-Telugu Health Tips

మీరు పార్టీలలో అప్పుడప్పుడు ఒక పెగ్ తాగుతుంటే పర్వాలేదు.కానీ ఒత్తిడి,( Stress ) ఇంట్లోనీ సమస్యల వల్ల తాగుతూ ఉన్నారంటే ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే అని అర్థం చేసుకోవాలి.ఒకవేళ మీరు పార్టీలకు వెళ్లినప్పుడు లేదా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మీకు తాగే మూడు లేకపోయినా వారు పోర్స్ చేస్తుంటారు.అలాంటి వారికి ముందే చెప్పేయాలి.నేను తాగుడు మానేద్దామని అనుకుంటున్నాను అని.వారు వినకపోతే కాస్త సీరియస్ గానే ఉండాలి.అంతేకాకుండా వారు ఫోర్స్ చేస్తున్నారు అని, వారు ఫీలవుతున్నారని మీరు మళ్ళీ తాగితే మాత్రం మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.రేపు అనారోగ్య సమస్యలు వస్తే ఫోర్స్ చేసిన వారే వద్దు అంటే విన్నావా ఇప్పుడు చూడు ఏమైందో అని మీకే నీతులు చెబుతారు.

Telugu Alcohol, Energy Drinks, Problems, Tips-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే మీ కళ్ళ ముందు ఎలాంటి తాగుడు కి సంబంధించిన అంశాలు ఉండకుండా చూసుకోవాలి.ఎందుకంటే మీరు ఎంత వద్దు అనుకున్న అసలు తాగాలన్న ఆలోచన లేకపోయినా ఆల్కహాల్ కి సంబంధించినవి చూడగానే మనసు వాటిపైకి వెళ్ళిపోతుంది.ఒకవేళ అంతగా తాగాలని ఉంటే చాలా రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.అలాగే రోజు మీరు ఒకే సమయానికి తాగుతూ ఉంటే ఆ సమయంలో మీరు ఏదో ఒక పని కల్పించుకొని బిజీగా ఉండడం మంచిది.

ఒత్తిడి వల్ల మీరు ప్రతిరోజు తాగుతూ ఉంటే దానికన్నా మెడిటేషన్( Meditation ) చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube