ఎండు గంజాయి రవాణా, అమ్మకం దారుల అరెస్ట్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ అధికారి సామల పంచాక్షరీ, కరీంనగర్ ఎక్సైజ్ ఉప కమీషనర్ విజయ భాస్కర్ రెడ్డి ల విశ్వసనీయమైన సమాచారం మేరకు సిరిసిల్ల ఎక్సైజ్ టాస్క్ఫోర్స్, సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ ముందు ఎం.డి.

 Arrest Of Sellers And Transporters Of Dry Cannabis, Cannabis, Arrest, Rajanna Si-TeluguStop.com

నయీమ్( మార్కేండాయ వీధి సిరిసిల్ల) గంజాయి నాందేడ్ నుంచి తెచ్చి చింతకుంట సంతోష్ (గాంధీ చౌక్ సిరిసిల్ల) అను అతనికి విక్రయిస్తుండగా, ఎక్సైజ్ వారు పట్టుకొని సోదాచేయగా వీరి వద్ద 36 గ్రాముల గంజాయి లభ్యం అయ్యిందని ఎక్సైజ్ సి.ఐ.గులామ్ ముస్తాఫా తెలిపారు.

గంజాయి రవాణా చేయడం , కల్గి ఉండడం, సేవించడం మత్తు పదార్థాల నిరోధక చట్టం ప్రకారం నేరం అని తెలిపారు.

అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలు కు తరలించడమైనదని ముస్తాఫా తెలిపారు.ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్సై శైలజ , సిరిసిల్ల ఎక్సైజ్ ఎస్సై లు ముకుంద శేఖర్, రాజెందర్ పాల్గొన్నారు.

ఇట్టి గంజాయి పట్టుకున్న సిబ్బంది ఎ.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, నరెందర్ , మధుకర్, రాకేష్, సుమన్, శంకర్ లను అధికారులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube