రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) భీమరం మండల కేంద్రంలో ఆదివారం ఈత ,తాటి వనంలో ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదం( fire hazard).ఈత, తాటి వనాలు పెద్ద ఎత్తున కాలిపోతుంటే గౌడ కులస్తులు ఎంతో ఆర్తనాధాలతో అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసిన స్పందించలేదు.
చివరకు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas) దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫైర్ ఇంజన్( Fire Engine ) ఘటన స్థలానికి వెంటనే పంపించారు.ఆపద సమయంలో ఆపద్బాంధవుల ఆదుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
ఈత,తాటి వనాన్ని సమయానికి స్పందించిన కాపాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గౌడ కులస్తులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.