దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ( Rajiv Kumar )అన్నారు.
యావత్ ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో భారత్( India ) లో 64.20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.భారత్ లో రికార్డు స్థాయిలో 31.20 కోట్ల మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే భారత్ లో జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమన్న ఆయన ఓటర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.27 రాష్ట్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదని వెల్లడించారు.అదేవిధంగా జమ్మూకశ్మర్ లో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ జరగనంత పోలింగ్ జరిగిందని తెలిపారు.