విద్యుత్ సరఫరాలో నాలుగు గంటలు ఏకధాటిగా అంతరాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పౌల్ట్రీ ఫామ్ రైతు సద్ది రాజిరెడ్డి కి చెందిన పౌల్ట్రీ ఫామ్ లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో నాలుగు గంటలు ఏకధాటిగా.అంతరాయం కలగడంతో ఉడుకపోతతో వేలాది కోళ్లు మృతి చెందాయని దీంతో రైతు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

 Four Hours Of Continuous Interruption In Power Supply, Four Hours Power Cut,cont-TeluguStop.com

దీంతో పౌల్ట్రీ ఫామ్ రైతు సద్ది రాజు లబోదిబోమంటున్నారు.

విద్యుత్ అంతరాయం లో సుమారు ఏకధాటిగా నాలుగు గంటల పాటు విద్యుత్తు సరపరా నిలిపివేయడం మూలంగానే ఉడుకపోతతో ఈ ఘటన జరిగిందని రైతులు వాపోతున్నారు.

అంతేకాకుండా మండలంలో నుంచి వివిధ గ్రామాలలో విద్యుత్ సరపరా లో అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుంది.వెంటనే సెస్ అధికారులు , సిబ్బంది స్పందించి ఇప్పటికైనా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలను కొట్టివేసి విద్యుత్ లూజు లైన్లను సరిచేయాలని రైతులు కోరుతున్నారు.

విద్యుత్ సరపరా లో ఏకధాటిగా నాలుగు గంటలు అంతరాయం ఏర్పడి కోళ్లు చనిపోయి నష్టపోయిన పౌల్ట్రీ ఫామ్ రైతు సద్ది రాజుకు సెస్ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

పౌల్ట్రీ ఫామ్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

విద్యుత్తు సరఫరాలో ఏకధాటిగా నాలుగు గంటలు అంతరాయం ఏర్పడి ఉడుకపోతతో 1000 కోళ్లు మృతి చెంది మూడు లక్షల వరకు నష్టపోయిన రైతు సద్ది రాజు ను బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాయి, వీర్నపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత శ్రీనివాస్ గౌడ్ లు పరామర్శించి పౌల్ట్రీ ఫామ్ ను శుక్రవారం పరిశీలించారు , సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube