ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌.. రోజుకు ఒక క‌ప్పు తాగితే మీ పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది!

తమ పొట్ట ఫ్లాట్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అదే కోరుకుంటారు.

 Taking This Fat Cutter Drink Will Make Your Stomach Flat! Fat Cutter Drink, Flat-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, ఒత్తిడి పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, మద్యపానం, ధూమ‌పానం, కంటి నిండా నిద్ర లేక‌పోవ‌డం తదితర కారణాలవల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.ఆ కొవ్వు కారణంగా పొట్ట లావుగా తయారవుతుంటుంది.

దీంతో పెరిగిన పొట్టను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తీసుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి.

Telugu Fat Cutter, Flat Stomach, Tips, Latest, Stomach-Telugu Health Tips

అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు మరియు రెండు బిర్యాని ఆకులు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధం అవుతుంది.గోరువెచ్చగా అయిన తర్వాత ఈ డ్రింక్‌ను తీసుకోవాలి.

ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఒక కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.దాంతో మీ బాన పొట్ట‌ కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

అంతేకాదు ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌ను తీసుకోవడం వల్ల మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.వేగంగా బరువు తగ్గుతారు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మరియు జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం చురుగ్గా సాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube