టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు చాలా సంవత్సరాల తర్వాత జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈషాన్ సూర్య దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన సన్నిలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న విష్ణు ఈ సినిమా గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.జిన్నా సినిమా తన మనసుకు ఎంతగానో నచ్చిన సినిమా అని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం రావడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే మంచు విష్ణు జిన్నా సీక్వెల్ గురించి కూడా మాట్లాడారు.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ జిన్నా సినిమా అక్టోబర్ 21వ తేదీ థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుందని ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత జిన్నా 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు.మరి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విష్ణుకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో తెలియాల్సి ఉంది.







