నైట్ 7 గంటల కంటే లోపే డిన్నర్ ను ఫినిష్ చేస్తే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

హెల్తీగా ఫిట్ గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వేళకు ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే అన్ని పోషకాలు మెండుగా ఉండే ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటారు.

 Amazing Benefits Of Eating Dinner Before 7pm! Health, Health Tips, Heart Attack,-TeluguStop.com

కానీ వేలకు మాత్రం తీసుకోరు.ఉదయం 10 గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం మూడింటికి లంచ్, రాత్రి పది లేదా 11 గంటలకు డిన్నర్ చేస్తుంటారు.

ఇలా తినడం వల్ల లాభాలేమో కానీ నష్టాలు మాత్రం భారీగా ఉంటాయి.అందుకే టైం టు టైం ఫుడ్ తీసుకోవ‌డం అలవాటు చేసుకోవాలి.

Telugu Benefits, Tips, Latest-Telugu Health

ముఖ్యంగా నైట్ ఏడు గంటల కంటే లోపే డిన్నర్ ను ఫినిష్ చేస్తే బోలెడు ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.నైట్ త్వరగా డిన్నర్ చేయ‌డం వ‌ల్ల‌ బ్లడ్ షుగర్ లెవెల్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.మధుమేహం( Diabetes ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే త్వరగా డిన్నర్ ను కంప్లీట్ చేసే వారి కంటే లేట్ గా డిన్నర్ చేసే వారిలోనే హార్ట్ ఎటాక్( Heart attack ) వచ్చే రిస్క్ ఎక్కువ.

అందుకే ఏడు గంటల లోపే డిన్నర్ ను పూర్తి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Benefits, Tips, Latest-Telugu Health

మలబద్ధకం.చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.అయితే లేట్ గా డిన్నర్ చేయడం కూడా ఇందుకు ఒక కారణం.

తిన్న వెంటనే పడుకుంటే ఫుడ్ అరగడం చాలా ఆలస్యం అవుతుంది.దాంతో జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడుతుంది.

ఫలితంగా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.నైట్ ఏడు గంట‌ల‌ కంటే లోపే డిన్న‌ర్ ను ఫినిష్ చేస్తే పడుకునే సమయానికి మొత్తం అరిగిపోతుంది.

మలబద్ధకం ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటుంది.జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) సైతం వేధించకుండా ఉంటాయి.

ఇక నైట్ త్వరగా డిన్నర్ ను పూర్తి చేస్తే నిద్ర నాణ్యత పెరుగుతుంది.మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మరియు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

కాబట్టి ఇకపై నైట్ ఏడు గంటల కంటే లోపే డిన్నర్ ను ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube