టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ( Ravi Teja ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నారు రవితేజ.ఎక్కువగా మాస్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో రవితేజ సరైన సక్సెస్ సినిమా అందుకొని చాలా కాలం అయ్యింది.క్రాక్ సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా ఒక్కటి కూడా రాకపోవడంతో అభిమానులు పూర్తిగా నిరాశ చెందుతున్నారు.
ఇకపోతే తాజాగా రవితేజ మిస్టర్ బచ్చన్ సి( Mr Bachchan )నిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా రవితేజపై విపరీతంగా ఇష్టం పెంచుకున్న ఒక అభిమాని, రవితేజకు ఓపెన్ లెటర్ రాశాడు.
తన బాధ మొత్తాన్ని ఆ లేఖలో రాసుకొచ్చాడు.ప్రస్తుతం ఈ ఓపెన్ లెటర్, సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.
ఆ లెటర్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.ఒకప్పుడు నాకు రవితేజ అంటే సినిమా, సినిమా అంటే రవితేజ.
కానీ నేను చిన్నతనంలో ప్రేమించిన రవితేజను ఇకపై చూడలేనని చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది.ఒకప్పుడు మీ చిత్రాల్లో నన్ను ఆకర్షించిన మేజిక్ ఇప్పుడు కనుమరుగైంది.
మీ సినిమాలతో కనెక్ట్ అవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను.
అన్నయ్యా.నా గుండె బద్దలైంది.ప్లీజ్ అర్థం చేసుకోండి.
ఒకప్పుడు స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్ పై చాలా జాగ్రత్తగా ఉండే రవితేజ.ఇప్పుడు ఉదయం ఆఫీస్ కెళ్లి, సాయంత్రం ఇంటికొచ్చే టైపులో రొటీన్ గా వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా లేఖలో ఉంది.
నన్ను ఎగతాళి చేసినా ఫర్వాలేదు, చుట్టుపక్కల వాళ్లు నిన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నయ్యా, అది నన్ను ఇంకా బాధిస్తోంది.నీ సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఆనందంతో ఏడ్చాను.
ఇప్పుడు నిన్ను చూసి ఏడుస్తున్నాను అన్నయ్యా అని బాధతో రాసుకొచ్చాడు.మరి ఈ లేఖ పై హీరో రవితేజ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.