టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ).హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.అంతేకాకుండా ఈ సినిమాతో మరోసారి తీవ్ర నిరాశ పరిచారు హీరో రవితేజ.
దీంతో అభిమానులు రవితేజ విషయంలో కాస్త గుర్రుగా ఉన్నారని చెప్పాలి.ఈ సినిమాలో పాటలు పెద్ద మైనస్ గా నిలిచాయి.
ముఖ్యంగా ఇందులో తెలుగులో కంటే హిందీలో పాటలు ఎక్కువగా ఉండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మూవీ మేకర్స్ హిందీ పాటల గోలను కాస్త తెగ్గోసారట.తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.వీకెండ్ రెండు రోజులు వున్నాయి.
రాఖీ సెలవు వుండనే వుంది.అందువల్ల మూడు రోజులు వసూళ్లకు చాన్స్ వుంది.
అందుకే లేట్ చేయకుండా ఈ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.kafa ఈ వారం నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి.
పెద్ద సినిమాలు రెండింటికీ సరైన టాక్ రాలేదు.తంగలాన్ కు సమీక్షలు బాగున్నా, కలెక్షన్లు ఇంకా పుంజుకోవాల్సి వుంది.
ఆయ్ సినిమా( Aay movie ) కు కూడా టాక్ ఇంకా జనంలోకి వెళ్లాల్సి వుంది.

అందుకే ఇప్పుడు సుమారు పది నిమిషాలు కట్ చేసి, బచ్చన్ సినిమాను కొత్తగా అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా హిందీ సీన్లను హిందీ పాటలను కట్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఇప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందా లేదంటే అలాగే నెగటివ్ టాక్ వస్తుందా అన్నది చూడాలి మరి.ఈ సినిమాపై రవితేజ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్ళగా ఆ అభిమానుల ఆశలు కాస్త ఆవిరి అయ్యాయి.కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.