ముఖం అందంగా ఉంటే సరిపోదు.కాంతివంతంగానూ ఉండాలి.
కానీ, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే చర్మ ఉత్పత్తులను యూజ్ చేయడం, మేకప్ తో నిద్రించడం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటి రకరకాల కారణాల వల్ల ముఖంలో గ్లో పోతుంటుంది.అందుకే చాలా మంది మార్కెట్‌లో లభ్యమయ్యే స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్స్, సీరమ్స్‌ను యూజ్ చేస్తూ ఉంటారు.
అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీని పాటిస్తే మాత్రం కేవలం ఒక్క రాత్రిలోనే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
మరి ఇంతకీ ఈ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న చియా సీడ్స్ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు, వన్ టబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని.ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.అనంతరం ఐస్ వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకుని.స్కిన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ రెమెడీని నైట్ నిద్రించే ముందు పాటిస్తే.ఉదయానికి ముఖం గ్లోయింగ్‌గా మరియు ఎట్రాక్టివ్ గా మారుతుంది.
అలాగే ఈ హోం మేడ్ చియా సీడ్స్ ఫేస్ మాస్క్‌ను తరచూ వేసుకోవడం వల్ల.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా సైతం ఉంటాయి.