న్యూయార్క్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎన్ఆర్ఐలపై మేయర్ ప్రశంసలు

78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.మనదేశంతో పాటు భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన విదేశాల్లోనూ ఇండిపెండెన్స్ డే( Independence Day ) వేడుకలు జరిగాయి.

 New York Eric Adams Praising Indian Diaspora Contributions For America Details,-TeluguStop.com

ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాలోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది.ఆ దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో( New York ) జరిగిన వేడుకల్లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్( Eric Adams ) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.డిప్యూటీ మేయర్, భారత సంతతికి చెందిన మీరా జోషితో పాటు పలువురు నగర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Telugu America, Eric Adams, Indiancultural, Indian Diaspora, Mahatma Gandhi, Del

అనంతరం ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ.న్యూయార్క్ నగరం అమెరికాలో ఢిల్లీ వంటిదని వ్యాఖ్యానించారు.నగరానికి ప్రవాస భారతీయులు ఎంతో సేవ చేస్తున్నారని ఎరిక్ ఆడమ్స్ ప్రశంసించారు.అత్యున్నత స్థాయిలో ఇరుదేశాల ప్రజలు ఈ స్పూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.వ్యాపారాలు, వైద్య రంగ నిపుణులుగా, అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా నగరంలో భారతీయ సమాజం స్పష్టమైన ఉనికిని చూపుతోందన్నారు.భారతీయులు( Indians ) న్యూయార్క్‌తో పాటు అమెరికాలో ఉండటం మా అందరికీ గర్వకారణమని ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.

Telugu America, Eric Adams, Indiancultural, Indian Diaspora, Mahatma Gandhi, Del

హత్యకు ముందు జాతిపిత మహాత్మా గాంధీ తన చివరి అడుగులు వేసిన న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనాన్ని సందర్శించిన రోజులను ఆడమ్స్ గుర్తుచేసుకున్నారు.ఆయన అడుగులను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని మేయర్ పేర్కొన్నారు.బ్రిటన్ నుంచి భారతదేశం మాదిరిగానే.అమెరికా కోసం జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో పోరాటం జరిగిందని ఆడమ్స్ చెప్పారు.న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయా శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు గడిచిన 78 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన ప్రగతి , అద్భుతమైన ప్రయాణాన్ని వివరించారు.

మరోవైపు.న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన జెండా వందనంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube