అందరి లాగానే మన తెలుగు హీరోయిన్లకు కూడా కొన్ని వీక్నెస్‌లు ఉంటాయి.కొందరికైతే ఫన్నీగా అనిపించే బలహీనతలు కూడా ఉంటాయి.
ఆ వీక్నెస్‌లు కొందరికి చెడు చేస్తాయి, కొందరి కెరీర్ లైఫ్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించవు.మన టాలీవుడ్ లో మొత్తం నలుగురు హీరోయిన్లకు ఫన్నీ బలహీనతలు ఉన్నాయి.వారెవరో, వారికున్న ఆ వీక్నెస్‌లు ఏంటో తెలుసుకుందాం.
• శ్రుతి హాసన్
( Shruti Haasan )
శ్రుతి హాసన్ ట్రెడిషనల్, గ్లామరస్ ఇలా ఏ రకం పాత్రలలోనైనా బాగా సూట్ కాగలదు.అలానే నటించగలదు.ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌కు ఒక క్రేజీ వీక్నెస్ ఉంది.అదేంటంటే, ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న హీరోలకు మంచి కంబ్యాక్ ఇస్తుంది.దాదాపు ఫ్లాప్ హీరోలందరికీ కంబ్యాక్ ఇవ్వకుండా ఉండలేదు.
అది తన బలహీనత.ఈ ముద్దుగుమ్మ “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో అరంగేట్రం చేసింది.
సెవెన్త్ సెన్స్, ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ (2012), బలుపు, రేస్ గుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్, క్రాక్ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
• మంచు లక్ష్మి
( Manchu Lakshmi )
మంచు లక్ష్మి యూఎస్ టీవీ సిరీస్ “లాస్ వేగాస్”లో ఓ చిన్న పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.తర్వాత “డెస్పరేట్ హౌస్‌వైవ్స్”, “లేట్ నైట్స్ విత్ మై లవర్” సింగిల్ ఎపిసోడ్స్‌లో కనిపించింది.ఆపై అనగనగా ఓ ధీరుడు, దొంగల ముఠా, గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించింది.
అయితే అవి ఆమెను స్టార్ హీరోయిన్‌గా లేదా యాక్ట్రెస్‌గా మార్చలేకపోయాయి.దానికి కారణం ఆమెకు ఉన్న ఒక ఫన్నీ బలహీనత అని చెప్పుకోవచ్చు.అదేంటంటే ఈవిడ చరిత్రలో నిలిచిపోయే గొప్ప క్యారెక్టర్లను రిజెక్ట్ చేస్తుంది.ఉదాహరణకు బాహుబలిలోని శివగామి, అరుంధతి సినిమాలోని జేజమ్మ పాత్రలు ముందుగా ఈమె వద్దకే వచ్చాయి.
కానీ వాటిని రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేసింది.
• ప్రణీత సుభాష్
( Praneetha Subhash )
ఈ బాపు గారి బొమ్మ “అత్తారింటికి దారేది” సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి అలరించింది.పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో చేసిన అన్ని సినిమాల్లోనూ ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్‌గానే నటించింది.అదే ఆమె క్రేజీ వీక్నెస్.
• సాయి పల్లవి
( Sai Pallavi )
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇప్పటికే 15కు పైగా సినిమాల్లో నటించింది.అయితే ఆమె ఇప్పటిదాకా ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగు సినిమాలు చేస్తోంది.అవి కూడా రీమేక్స్ కాదు.రీమేక్ ఫిల్మ్స్‌లో నటించలేకపోవడమే ఆమె బలహీనత.