తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ ( Rythu Runamafi )చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని రుణమాఫీ అంశంలో ఇరుకున పెడుతూ వచ్చింది.
కచ్చితంగా రుణమాఫీ అమలు చేయలేరని, అలా చేస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ సైతం విసిరారు. అయితే రుణమాఫీని ఆగస్టు 15 నాటికి అమలు చేసి చూపిస్తామని చెప్పినట్లుగానే , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రుణమాఫీని అమలు చేశారు.
తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్- బీఆర్ ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతుండగా … చెప్పిన హామీని అమలు చేయకుండా కోతలు పెట్టి మోసం చేశారని బీఆర్ఎస్ చెబుతోంది.
రుణ మాఫీ చేయడానికి ముందు విసిరిన సవాళ్లను ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ హరీష్ రావును నిలదీస్తోంది రుణమాఫీ గడువు ఆగస్టు 15తో పూర్తి అయింది. ఆఖరి విడత రుణమాఫీని అదే రోజు చేసినట్లు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.దేశ చరిత్రలో ఎవరూ, ఎప్పుడు చేయని విధంగా రుణమాఫీని అమలు చేసి చూపించామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఈ విషయంలో రాజీనామా సవాల్ విసిరిన హరీష్ రావు ( Harish Rao )వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు.అగ్గి పెట్టె హరీష్ రావు అంటూ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.చెప్పినట్లు రుణమాఫీ చేశామని, రాజీనామా ఎప్పుడు చేస్తారని ఆ ఫ్లెక్సీలో హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు.రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీలో కొటేషన్ల పెట్టి మరీ హరీష్ రావు ను ఇరుకున పట్టే ప్రయత్నం చేస్తోంది.