అమెరికాలో భారతీయులు, భారత సంతతి వ్యక్తుల హత్యలు, ఆత్మహత్యలకు ఫుల్స్టాప్ పడటం లేదు.తాజాగా నార్త్ కరోలినాలోని( North Carolina ) ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి పాల్పడిన ఓ బాలుడు.
36 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపినట్లుగా అధికారులు తెలిపారు.మృతుడిని మైనాంక్ పటేల్‌గా( Mainank Patel ) గుర్తించినట్లు సాలిస్బరీ పోస్ట్ నివేదించింది.
రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం.నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.బాలుడు జువెనైల్( Juvenile ) కావడంతో అతని పేరును బయటపెట్టలేకపోయారు.
911 నెంబర్‌కు వచ్చిన ఫోన్ కాల్‌కు స్పందించిన పోలీసులు హుటాహుటిన ఎయిర్‌పోర్టు రోడ్డులోని టొబాకో హౌస్ కన్వీనియన్స్ స్టోర్‌కి( Tobacco House Convenience Store ) చేరుకున్నారు.పటేల్ అప్పటికే తీవ్ర గాయాలతో కిందపడి ఉండగా.ఆయనను తక్షణం నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు.అనంతరం షార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించగా.గాయాలతో అతను మరణించినట్లు నివేదిక వెల్లడించింది.
సీసీ కెమెరా ఫుటేజ్‌లో స్టోర్ పార్కింగ్ ఏరియాలో పొడవాటి, శ్వేతజాతికి చెందిన బాలుడు నడుస్తున్నట్లుగా కనిపించింది.బ్లాక్ షార్ట్స్, బ్లాక్ హూడీ, బ్లాక్ స్కీ మాస్క్ .వైట్ కలర్ నైక్ టెన్నిస్ షూ ధరించాడు.అతని చేతిలో బ్లాక్ కలర్ హ్యాండ్‌గన్ ఉన్నట్లు కనిపించిందని అధికారులు వెల్లడించారు.
కాల్పులు జరపడానికి కారణాలు తెలియరాలేదని.అయితే ఈ ఘటనను ప్రస్తుతానికి దోపిడీగా భావిస్తున్నట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
పటేల్‌కు భార్య , ఐదేళ్ల కుమార్తె ఉండగా.అతని సతీమణి ప్రస్తుతం ఏడున్నర నెలల గర్భవతి.
పటేల్ మరణంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఘటనాస్థలంలోని కన్వీనియన్స్ స్టోర్‌లో ఆయనకు నివాళులర్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.తాను నిన్న ఉదయం అతనిని చూశానని.ఇంటికి వెళ్తుండగా పటేల్ స్టోర్ వద్ద పోలీసులు గుమిగూడి ఉన్నారని ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.